రహస్య జీవోలతో బాబు ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు!: ఆనం రామనారాయణ రెడ్డి
- బాబు పాలనలో ఏపీ ఆర్థికస్థితి పూర్తిగా దిగజారింది
- ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది
- నెల్లూరులో మీడియాతో వైసీపీ నేత
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీ ఆస్తులు పెరగకపోగా, అప్పులు పెరిగాయని ఆనం దుయ్యబట్టారు. టీడీపీ అధినేత రహస్య జీవోలతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అలాగే సమీక్షల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోలను బయటపెట్టాలని గవర్నర్ ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెట్టాలన్నారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.