Chandrababu: నన్ను గుర్తు పెట్టుకున్న మీకందరికీ ధన్యవాదాలు: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
"ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ఆయనకు పలువురు ప్రముఖులు, జాతీయ నేతలు శుభాకాంక్షలు తెలియజేయగా, చంద్రబాబు స్పందించారు. ఆపై "మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా" అని అన్నారు.

దాని తరువాత "ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయింది. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాను. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నది" అని, "ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే  అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం" అని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Birthday
Twitter

More Telugu News