నేను ప్రచారానికి వెళ్లిన సమయంలో నా ఇంటిని దోచేశారు: బెంగాల్ బీజేపీ అభ్యర్థి
- నా ఇంటి చుట్టూ కొందరు తిరగడం గమనించా
- గట్టిగా నిలదీయడంతో పారిపోయారు
- ప్రచారానికి వెళ్లిన సమయంలో ఇంటిపై దాడి
- ఎలక్ట్రానిక్ పరికరాలు, సామగ్రి ధ్వంసం
అయితే, నేటి ఉదయం తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో తన ఇంటిని ధ్వంసం చేశారని, ఈ దాడిలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సామగ్రి ధ్వంసమయ్యాయని ఛటర్జీ తెలిపారు. ఇది టీఎంసీ పనేనని ఆమె ఆరోపించారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఎంసీపై నిందలు మోపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని టీఎంసీ హుగ్లీ జిల్లా నేత తపన్ దాస్ గుప్తా పేర్కొన్నారు. అసలు ఛటర్జీకి టికెట్ కేటాయించడం ఆ పార్టీలోని కొందరికి నచ్చలేదని, దీంతో తన ఇంటిపై దాడి జరిగిందని ఆమె చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఛటర్జీ తెలిపారు.