విజయవాడలో మందుబాబుల హల్ చల్.. రోడ్డుపై వెళుతున్న హిజ్రాలపై దాడి!
- కృష్ణా జిల్లా లోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఘటన
- హిజ్రాలపై వెంటపడి దాడిచేసిన యువకులు
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
వెంటనే అక్కడకు వెళ్లిన మందుబాబులు వారితో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ 10 మంది యువకులు రెచ్చిపోయారు. దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. చివరికి మందుబాబుల దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. తమపై తాగుబోతు యువకులు దాడిచేయడంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.