New Zealand: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆసీస్-న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు

షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్-ఆసీస్ మహిళ క్రికెటర్ నికోలా హన్‌‌కాక్‌లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గతవారాంతంలోనే పెళ్లాడిన వీరిద్దరూ తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పెళ్లితో ఒక్కటైన వీరిద్దరికీ సహచర క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

కివీస్ ఆల్‌రౌండర్ అయిన జెన్సన్ బిగ్‌బాష్ లీగ్‌లోని తొలి రెండు సీజన్లలో ‘మెల్‌బోర్న్ స్టార్స్’కు ప్రాతినిధ్యం వహించింది. మూడో ఎడిషన్‌లో మెల్‌బోర్న్ రెనెగడెస్‌కు మారింది. ఇక, నికోల్ హన్‌కాక్ ‘టీం గ్రీన్’కు ప్రాతినిధ్యం వహిస్తోంది. వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారి చివరికి పెళ్లికి దారితీసింది.  

స్వలింగ సంపర్క వివాహాలు న్యూజిలాండ్‌లో చట్టబద్ధం కావడంతో వీరి పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదు. గతేడాది  దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వ్యాన్ నీకెర్క్.. తన సహచరి అయిన మారిజానే కేప్‌ను పెళ్లాడింది. కాగా, అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్న తొలి జంటగా అమీ శాటెర్త్‌వైట్-లీ తహహు గుర్తింపు పొందగా, రెండో జంటగా  వ్యాన్ నీకెర్క్-కేప్‌లు రికార్డుకెక్కారు.
Go Back to Shorts
New Zealand
Australia
Hayley Jensen
Nicola Hancock
Marriage

More Telugu News