జీవీఎల్ పై దాడి వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి: బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి

  • జీవీఎల్ పై దాడిని ఖండిస్తున్నాం
  • ఇలాంటి చర్యలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు విసిరిన సంఘటనపై ఆ పార్టీ నాయకుడు ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఏపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా బీజేపీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. బీజేపీపై కుట్ర పూరితమైన చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వారిపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Go Back to Shorts
BJP
GVL
Ap
Vishnu Vardhan Reddy
New Delhi

More Telugu News