మోదీ ప్రజాకర్షణను చూసి ఓర్వలేకే జీవీఎల్ పై చెప్పుతో దాడిచేయించారు!: కన్నా లక్ష్మీనారాయణ
- జీవీఎల్ పై దాడిని ఖండించిన కన్నా
- బీజేపీ అభివృద్ధి విధానాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శ
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్
కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ @GVLNRAO గారిపై ఆగంతకుడి దాడిని ఖండిస్తున్నాను. ఇది బీజేపీ అభివృద్ధి విధానాలను, మోదీ గారి ప్రజాకర్షణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రేరేపిత చర్య. ఇలాంటి చర్యలు బీజేపీ నేతల స్థైర్యాన్ని తగ్గించలేవు’ అని ట్వీట్ చేశారు.