ఈ వ్యవస్థ మారకపోతే.. ఇంకా చాలామంది నయీమ్ లు పుట్టుకొస్తారు!: సీపీఐ నేత నారాయణ హెచ్చరిక
- ఆస్తులపైనే దర్యాప్తు చేయడం సరికాదు
- ప్రభుత్వాలు పెంచి పోషించిన విషబిందువు నయీమ్
- హైదరాబాద్ లో మీడియాతో సీపీఐ నేత
ప్రభుత్వ విధానాల ఆధారంగా, రాజకీయ నాయకుల సాయంతో నయీమ్ దందా నడిపించాడని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నయీమ్ యథేచ్ఛగా వాడుకున్నాడని దుయ్యబట్టారు. ఈ వ్యవస్థ మారకుంటే ఇలాంటి నయీమ్ లు చాలామంది వస్తూనే ఉంటారని హెచ్చరించారు.
నయీమ్ ను ప్రభుత్వాలు పెంచిపోషించిన ఓ విష బిందువుగా నారాయణ అభివర్ణించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపితేనే బాధ్యులకు న్యాయం జరుగుతుందన్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.