Andhra Pradesh: మీ ప్రాంతంలో నీటి కొరత ఉందా?.. ‘జలవాణి’కి ఫోన్ చేయండి!: ఏపీ సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీటి సమస్య ఉన్నా తమ కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం జలవాణి పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 18004251899కు ఫోన్ చేసి తాగునీటి ఇబ్బందులను చెప్పాలని సూచించారు. తమకు ఇప్పటివరకూ తాగు నీటి సమస్యపై 3,813 ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిలో 80.51 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొన్నారు.

ట్రాన్స్ పోర్టేషన్ విధానం ద్వారా రోజుకు 15,000 ట్రిప్పుల చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పూర్తయిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లను ఇందుకోసం వాడుకుంటున్నామని చెప్పారు. అలాగే 469 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటి కొరత లేకుండా చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Twitter

More Telugu News