'మా' డబ్బు మాయమంటూ ప్రచారం .. క్లారిటీ ఇచ్చిన జీవిత
- నరేశ్ అందుబాటులో లేక నా డబ్బు సర్దుబాటు చేశాను
- ప్రకటనల కోసమే ఖర్చు చేయడం జరిగింది
- ఎలాంటి అవినీతి జరగలేదు
దాంతో వెంటనే జీవిత రంగంలోకి దిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ, ''మా'లో అర్హులైన సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలనే విషయం గురించి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారితో మాట్లాడాము. ఆయన హామీ ఇవ్వడంతో .. 'మా' వంతుగా ఆ పథకాలను ప్రచారం చేయడానికి గాను ప్రకటనలను రూపొందించాము. 'మా' అధ్యక్షుడు నరేశ్ షూటింగులో ఉండటంతో, ఆ ప్రకటనలకి అయిన ఖర్చును నేను సర్దుబాటు చేశాను. ఆ తరువాత ఆ మొత్తాన్ని తీసుకున్నాను. కావాలని కొంతమంది ఈ విషయాన్ని తప్పుగా ప్రచారం చేశారు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు .. 'మా' నిధులు దుర్వినియోగమూ కాలేదు" అంటూ ఆమె స్పష్టం చేశారు.