విడుదలకి ముస్తాబవుతోన్న 'జెర్సీ'
- క్రికెట్ నేపథ్యంలో సాగే కథ
- ఫ్యామిలీ ఆడియన్స్ నూ రప్పించే కంటెంట్
- ఈ నెల 19వ తేదీన భారీ విడుదల
నాని ఈ సినిమాలో క్రికెటర్ 'అర్జున్' గా కనిపించనున్నాడు. ప్రేమ .. కుటుంబం .. బంధాలు .. పరిస్థితులు .. ఆశయం .. ఇలా బలమైన ఎమోషన్స్ తో ఈ కథ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే కంటెంట్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాని ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.