విదేశీ పత్రికల్లో ఇలాంటి వార్తలు రాకూడదనే మహాకూటమి ఏర్పాటు: అఖిలేశ్ యాదవ్
- రాజ్యాంగ పరిరక్షణ కోసమే మహాకూటమి ఏర్పాటు
- మోదీ మేకిన్ ఇండియా అంటూనే ఆయన స్నేహితులకు విదేశీ కాంట్రాక్టులు
- జవాన్లు ఉన్నంత వరకు దేశ సరిహద్దులు భద్రంగా ఉంటాయి
ప్రధాని నరేంద్రమోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ ‘మేకిన్ ఇండియా’ అంటూనే విదేశాల నుంచి కొనుగోళ్ల కోసం తన స్నేహితులకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు చెబుతున్నట్టు ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయన్న వ్యాఖ్యలను అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు సరికాదని, జవాన్లు ఉన్నంతకాలం దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకే మహాకూటమి ఏర్పాటైందని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.