కేటీఆర్ ట్విట్టర్ రికార్డ్... పుత్రోత్సాహాన్ని చూసి నెటిజన్ల రియాక్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ ట్విట్టర్ రికార్డ్... పుత్రోత్సాహాన్ని చూసి నెటిజన్ల రియాక్ట్!

  • 13 ఏళ్ల వయసులోనే ఎదిగాడు
  • పుత్రోత్సాహాన్ని చిత్రం రూపంలో చూపిన కేటీఆర్
  • 19 వేలకు పైగా లైక్స్
కేవలం 13 సంవత్సరాల వయసులోనే తన బిడ్డ హిమాన్షు తనకన్నా ఎత్తుగా పెరిగిపోయాడని చెబుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువనేత కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటో వైరల్ అయింది. తన కుమారుడిని హత్తుకున్న ఆయన, పుత్రోత్సాహాన్ని చూపగా, గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్లతో పోలిస్తే, దీనికి ఎంతో స్పందన వచ్చింది. దాదాపు 19 వేలకు పైగా లైక్స్ ఈ చిత్రానికి వచ్చాయి. తన కుమారుడిపై కేటీఆర్ చూపిన వాత్సల్యానికి వందలాది మంది స్పందించారు. ట్విట్టర్ తో పాటు తెలుగు మీడియా సైతం ఈ చిత్రాన్ని హైలైట్ చేసింది. నేడు దాదాపు అన్ని దినపత్రికలూ కేటీఆర్, తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న ఈ చిత్రాన్ని ప్రచురించాయి.
KTR
Himanshu
Twitter

More Telugu News