నన్ను కొనేంత ఆస్తి మీ దగ్గర లేదు: రేణుకా చౌదరి
- ఖమ్మం ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పు రాబోతోంది
- ధన రాజకీయాలు నాకు గిట్టవు
- కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే నేను సహించను
తనను గెలిపించేందుకు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు చేసిన కృషి చాలా గొప్పదని... అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రేణుక అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా తాను సహించనని చెప్పారు. ప్రేమ, అభిమానంతో తనను ఎవరైనా పలకరించవచ్చని... డబ్బుతో తనను కొనేంత ఆస్తి మీ దగ్గర లేదని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.