గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగుకు ప్రతిపాదనలు

  • మొదటిది.. గుంటూరు పశ్చిమలోని 244వ కేంద్రం
  • రెండోది.. నరసరావుపేటలోని 94వ కేంద్రం
  • కలెక్టర్ సిఫారసుల మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపాం: ద్వివేది
గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ కేంద్రం ఒకటి కాగా, నరసరావుపేటలోని 94వ కేంద్రం రెండోది అని, ఈ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలన్న గుంటూరు కలెక్టర్ సిఫారసుల మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. సీఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Go Back to Shorts
Guntur District
west constituency
narasaraopet
CEC

More Telugu News