Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం

షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అవార్డు ప్రకటించింది. రష్యాకు భారతదేశం సుదీర్ఘకాలం మిత్రదేశం అన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాలదీ కాలపరీక్షకు నిలిచిన స్నేహం. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా స్నేహసంబంధాల్లో ఎలాంటి తేడా రాలేదు. ఈ క్రమంలో, బంధం మరింత బలపడేలా భారత ప్రధానికి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారాన్ని అందివ్వాలని రష్యా అధినాయకత్వం నిర్ణయించుకుంది. రష్యాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ మేరకు రష్యా దౌత్యకార్యాలయం వెల్లడించింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత దృఢతరం కావడానికి మోదీ ఎంతో కృషి చేశారని, ఆ కృషికి గుర్తింపుగానే అవార్డు ఇస్తున్నామని రష్యా దౌత్య కార్యాలయం తెలిపింది.
Go Back to Shorts
Narendra Modi
Russia

More Telugu News