భారత ప్రధాని గురించి పాక్ ప్రధాని కంటున్న కలలు నిజం కానీయరాదు: ఒవైసీ

  • మోదీ అధికారంలోకి వస్తే మంచిదన్న ఇమ్రాన్
  • ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం కావంటూ వ్యాఖ్య
  • మోదీతో ఇమ్రాన్ కలిసిపోయినట్టు కనిపిస్తోంది
ఇప్పటి పరిస్థితుల్లో ప్రధాని మోదీకి ఓటు వేస్తే పాకిస్థాన్ కు వేసినట్టేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే మంచిదని పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ స్పందించారు. ఇమ్రాన్ కలలను నిజం కానీయరాదని చెప్పారు. మోదీతో ఇమ్రాన్ కలిసిపోయినట్టు కనిపిస్తోందని అన్నారు.

మోదీ మరోసారి ప్రధాని అయితే భారత్-పాక్ ల మధ్య నెలకొన్న సరిహద్దు, కశ్మీర్ లాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా మరే పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.
Go Back to Shorts
modi
imran khan
owaisi

More Telugu News