నెల్లూరులో మేకపాటి వర్సెస్ కొమ్మి వర్గీయుల ఘర్షణ.. ఇద్దరు వైసీపీ నేతలకు పగిలిన తలలు!
- చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లెలో ఘటన
- పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి యత్నం
- అడ్డుకున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు గ్రూపు
రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వైసీపీ నేతల తలలు పగలడంతో వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘర్షణ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైసీపీ, టీడీపీ నేతలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని కోరారు.