ఆంధ్ర ప్రజల గుండెల్లో గుద్దుతున్న వారితో జగన్ చెట్టాపట్టాలా?: లంకా దినకర్
- బకాయిపడ్డ బాకీలను తెలంగాణ ఎందుకు చెల్లించదు?
- తన మిత్రుడైన కేసీఆర్ ని జగన్ అడగరే?
- ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడే వాళ్లతో జతకడతారా?
ఏపీకి విద్యుత్ బకాయిల కింద తెలంగాణ ప్రభుత్వం బాకీ పడ్డ రూ.5 వేల కోట్లు ఎందుకు చెల్లించడం లేదని, ఈ విషయాన్ని తన మిత్రుడైన కేసీఆర్ ని జగన్ ఎందుకు అడగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలు జగన్ ని ప్రశ్నిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఏపీ ప్రయోజనాలకు అడ్డుకునే వాళ్లతో జగన్ ఎందుకు జతకడుతున్నారు? అని ప్రశ్నించారు. కేవలం, హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసం మోదీకి జగన్ దాసోహమయ్యాడని విరుచుకుపడ్డారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల గుండెల్లో గుద్దుతున్న మోదీ, కేసీఆర్ తో కలిసి జగన్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని దుమ్మెత్తిపోశారు.