'పాకిస్థాన్ పై మరో దాడి' వార్తలపై స్పందించిన ఇండియా!
- పాకిస్థాన్ వార్ హిస్టీరియాతో బాధించబడుతోంది
- పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఎన్నికలను టార్గెట్ చేసుకుంటున్నారు
- ఖురేషీ వ్యాఖ్యలను ఖండించిన భారత్
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి అసలు సిసలైన ప్రతినిధి పాకిస్థానేనని, మరో దాడికి సిద్ధమవుతున్న ఉగ్రవాదుల నుంచి దేశం దృష్టిని మరల్చేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అంత భయమే ఉంటే ద్వైపాక్షిక మార్గాల ద్వారా తమకు ఈ సమాచారం ఎలా వచ్చిందో తెలియజేయాలని సవాల్ విసిరారు. కాగా, బాలాకోట్ పై భారత వాయు సేన దాడి తరువాత సుమారు నెల రోజులకు ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.