లక్ష్మీపార్వతి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు: జీవితా రాజశేఖర్ ఆగ్రహం

  • కంప్లయింట్ ఇచ్చిన వాడి వయసేంటి?
  • ఎన్నికలకు ముందే మాట్లాడాల్సిన అవసరమేంటి?
  • ఫిర్యాదు నిరూపితమే కాలేదు ఛానెల్స్ లో చూపిస్తారా?
వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై కోటి అనే వ్యక్తి నిన్న తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను వైసీపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ ఖండించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘లక్ష్మీపార్వతి గారి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు. కంప్లయింట్ ఇచ్చిన వాడి వయసేంటి? ఈ వెధవ ఎన్నికలకు ముందే మాట్లాడాల్సిన అవసరమేంటి? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నప్పుడు తెలియలేదా?’ అని ప్రశ్నించారు.

 లక్ష్మీపార్వతిపై ఆరోపణల గురించి టీవీ ఛానెల్స్ లో చూపిస్తున్న వాళ్లకు అమ్మలు, అక్కాచెల్లెళ్లు లేరా? చేసిన ఫిర్యాదు నిరూపితమైందా? ఈ లోపే, అతన్ని తీసుకొచ్చి ఛానెల్స్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తారా? ఏ ఛానెల్స్ వాళ్లు అయితే అతనితో మాట్లాడిస్తున్నారో, వాళ్లు కూడా ఓ అమ్మకు పుట్టినవాళ్లేగా అని నిప్పులు చెరిగారు. ఇలాంటి ఛానెల్స్ మీడియా పరువును తీస్తున్నాయని, ఇలాంటి సంపాదన కావాలా? అని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వాళ్లను మీడియా వాళ్లే వెలివేయాలని జీవితా రాజశేఖర్ సూచించారు.
Go Back to Shorts
YSRCP
Lakshmi parvathi
Tollywood
jeevitha

More Telugu News