శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.5.07 కోట్లు!
- రాజాం పోలీస్ స్టేషన్ కు తరలింపు
- శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళుతున్న బస్సులో తనిఖీలు
- వైసీపీ నేత కుమారుడిని విచారిస్తున్న పోలీసులు
తాజాగా ఈ నగదు లెక్కింపును పోలీసులు పూర్తిచేశారు. ఈ మూడు బ్యాగుల్లో కలిపి రూ.5,07,88,000 ఉన్నట్లు తేల్చారు. శ్రీకాకుళం నుంచి పాలకొండకు ఈ నగదును తలరిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే బస్సులో పాలకొండ వైసీపీ నేత కుమారుడు విక్రాంత్ కూడా ఉండటంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు.