నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను... అద్వానీ ఇప్పుడు చెప్పారంతే: చంద్రబాబు
- ప్రజాస్వామ్య విలువలు తెలియని మోదీ
- దేశ భవిష్యత్తు ఆయన చేతిలోనా
- అద్వానీ మాటలు మోదీని ఉద్దేశించినవేనన్న చంద్రబాబు
అంతకుముందు "రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారు అన్న మాటలు నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మనపై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది" అని, "జాతీయ వాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ, భావప్రకటనా స్వేచ్ఛ కలిగి ఉంటూ, ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమే కానీ, మనతో విభేదించిన వారిని మన ప్రత్యర్థులను, శత్రువులలాగా చూడటం కాదు... దేశ ద్రోహులుగా ముద్ర వేయడం కాదు" అని ట్వీట్లు పెట్టారు.
"దేశమే ముందు. ఆ తర్వాతే పార్టీ. ఆ తర్వాతే వ్యక్తి. వాక్ స్వాతంత్ర్యం, వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలి" అని చంద్రబాబు సూచించారు.