కొరటాలతో చిరూ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది ఖరారైపోయింది

  • ముగింపు దశలో 'సైరా'
  • జూన్ లో సెట్స్ పైకి కొరటాల ప్రాజెక్టు
  • ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో  
చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వచ్చేనెల నాటికి చిరంజీవి పోర్షన్ కి సంబంధించిన షూటింగు పూర్తవుతుందట. అందువలన ఆయన జూన్ నుంచి కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా నుంచి బ్రేక్ తీసుకుని .. విదేశీ పర్యటనలో వున్నారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఆయన 'సైరా' షూటింగును పూర్తి చేయనున్నారు.

ఇక ఆలోగా కొరటాల తన వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేసే పనిలో వున్నాడట. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ  సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత త్రివిక్రమ్ - డీవీవీ దానయ్య దర్శక నిర్మాతలుగా చిరంజీవి సినిమా వుండనుందనే సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
chiranjeevi
koratala

More Telugu News