పసుపు-కుంకుమ పథకం నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- పిటిషన్ దాఖలు చేసిన జనచేతన వేదిక
- విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
- మండిపడిన టీడీపీ
దీనిపై, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జగన్ బినామీ సంస్థ జనచేతన వేదిక ద్వారా పసుపు-కుంకుమ నిధులు అడ్డుకోవాలని పిటిషన్ వేశారని ఆరోపించారు. నిధులు రాకుండా అడ్డుకున్న వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంచితే, ఎన్నికల నేపథ్యంలో ఈసీ పసుపు-కుంకుమ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తుది దశ చెక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో వేసినట్టు సమాచారం. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన నగదు మొత్తాన్ని ముందుగానే బ్యాంకులో జమ చేసినట్టు తెలుస్తోంది.