Allu Arjun: మనవడి పుట్టినరోజుకు స్విమ్మింగ్ పూల్ ను కానుకగా ఇచ్చిన అల్లు అరవింద్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు ఫ్యామిలీ మ్యాన్ అనే పేరుంది. సినిమా షూటింగులు లేకపోతే కుటుంబానికే పూర్తి సమయం కేటాయించే హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఇవాళ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో బన్నీ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

 "అయాన్ ఐదో పుట్టిన రోజు సందర్భంగా మా నాన్న ఇచ్చిన కానుక చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ కానుక ఓ స్విమ్మింగ్ పూల్ కావడమే నా ఆశ్చర్యానికి కారణం. 45 రోజుల క్రితమే అయాన్ వాళ్ల తాతయ్యను పూల్ కావాలని అడిగాడు. సరే అని చెప్పి ఆయన నిజంగానే స్విమ్మింగ్ పూల్ కట్టించేశారు. ఈ పూల్ కి మేం 'అల్లు పూల్' అని నామకరణం చేశాం. ఇలాంటి తాతయ్య ఉండడం నిజంగా అయాన్ అదృష్టం అని భావిస్తాను. మా ఇంట్లో ఈ తరం పిల్లల్ని చూస్తే అసూయ కలుగుతోంది" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.

Go Back to Shorts
Allu Arjun
Tollywood

More Telugu News