ajith: అజిత్ పోర్షన్ పూర్తి .. విడుదల తేదీ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో ఆయన తన దూకుడు కొనసాగిస్తూనే వస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన 'విశ్వాసం' రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సినిమాగా ఆయన 'పింక్' మూవీ రీమేక్ చేస్తున్నాడు. కొంతకాలం క్రితం హిందీలో వచ్చిన 'పింక్' వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. వసూళ్ల పరంగా నిర్మాతలకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

అలాంటి ఆ సినిమాను 'నెర్కొండ పరవాయ్' టైటిల్ తో తమిళంలోకి బోనీకపూర్ రీమేక్ చేస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కొంతకాలంగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేస్తున్నాడు. తాజాగా అజిత్ పోర్షన్ కి సంబంధించిన షూటింగును పూర్తి చేశారట. విద్యాబాలన్ .. శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు. 
Go Back to Shorts
ajith
vidyabalan
shraddha srinadh

More Telugu News