నేను ప్యాకేజీ తీసుకోవడం మీరు చూశారా? లేక సెల్ఫీ తీశారా?: దివ్యవాణిపై మండిపడ్డ అలీ
- వైసీపీలో చేరేందుకు అలీ ప్యాకేజీ తీసుకున్నారన్న దివ్యవాణి
- టీడీపీలో చేరేందుకు మీరెంత తీసుకున్నారన్న అలీ
- సినీ నటుల మధ్య పేలుతున్న మాటల తూటాలు
తాజాగా దివ్యవాణి మాట్లాడుతూ, ప్యాకేజీ తీసుకుని వైసీపీలో అలీ చేరారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అలీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ప్యాకేజీ తీసుకున్నట్టు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీలో చేరేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.