తెలంగాణ ప్రభుత్వం రిమోట్ మోదీ చేతుల్లో ఉంది: రాహుల్ గాంధీ
- రాఫెల్ కుంభకోణంపై కేసీఆర్ మాట్లాడారా?
- జీఎస్టీ విషయంలో మోదీని కేసీఆర్ సమర్థించలేదా?
- అబద్ధాలు చెప్పడంలో మోదీని మించిన వారు లేరు
మోదీ దేశానికి కాదు అనిల్ అంబానీ, నీరవ్ మోదీలాంటి వారికే చౌకీదార్ అని, దొంగలకు ఆయన మద్దతు ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ మోసం చేశారని, అబద్ధాలు చెప్పడంలో ఆయన్ని మించిన వారు లేరని విమర్శించారు. దేశానికి న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదోడి అకౌంట్ లో ఏడాదికి రూ.72 వేలు వేస్తామని హామీ ఇచ్చారు. పేదలపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని, తాము మాత్రం పేదరికంపై ఆ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. పేదలు, రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని రాహుల్ మరోసారి వ్యాఖ్యానించారు.