ప్రచార షెడ్యూల్‌తో అధినేతల బిజీ...కడప, చిత్తూరు జిల్లాల్లో బాబు, నాలుగు జిల్లాల్లో జగన్
- పశ్చిమగోదావరిని చుట్టేయనున్న పవన్‌కల్యాణ్
- ఎన్నికలు సమీపిస్తుండడంతో స్పీడ్ పెంచిన నేతలు
- వీలైనన్ని ప్రాంతాలు చుట్టేస్తున్న వైనం
వైసీపీ అధినేత విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం 9.30 గంటకు ఎస్.కోటలో, 11.30 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తిలో, 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో, 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సభల్లో ప్రసంగిస్తారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలోనే నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంటలోని గోడవారి రామచంద్రరావు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో,11.30 గంటలకు తణుకులోని పాత బెల్లం మార్కెట్ వద్ద, మధ్యాహ్నం ఒంటి గంటకు నిడదవోలులోని గణేష్ చౌక్ వద్ద ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం 2.30 గంటలకు తాడేపల్లిగూడెం శేషమహల్ సర్కిల్ వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు.