ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ రాజశ్యామల యాగం.. నెల్లూరులో అత్యంత రహస్యంగా జరిగిన వైనం!
- అధికారం కోసం కష్టపడుతున్న జగన్
- పాల్గొన్న 27 మంది రిత్వికులు
- కేసీఆర్ సలహాతో యాగం చేపట్టిన జగన్
రాజశ్యామల యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నట్టు బెంగళూరు మిర్రర్ పేర్కొంది. విశాఖ శారాదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలిపింది. అలాగే, జగన్‌కు బదులు ప్రధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని పూర్తి చేసినట్టు వివరించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ కూడా యాగం నిర్వహించారని తెలుస్తోందని ‘బెంగళూరు మిర్రర్’ పేర్కొంది.