బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కుమార్తె
Add ap7am to your home Screen

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కుమార్తె

  • కపిల్ బయోపిక్ గా తెరకెక్కుతున్న '83'
  • కపిల్ పాత్రను పోషిస్తున్న రణవీర్ సింగ్
  • అసిస్టెంట్ డైరెక్టర్ గా కపిల్ కుమార్తె
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కుమార్తె అమియా సినీరంగ ప్రవేశం చేస్తోంది. 1983లో భారత్ తొలిసారి ప్రపంచ కప్ ను గెలవడంలో అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ ది కీలక పాత్ర అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా '83' అనే పేరుతో బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతోంది. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... కపిల్ పాత్రను రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు.

మే నెల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే రణవీర్ సింగ్ చాలా రోజుల నుంచి క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా కపిల్ కూతురు అమియా బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతోంది. అయితే హీరోయిన్ గా కాకుండా... అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆమె ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా అమియా మాట్లాడుతూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా తనకు అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.
kapil dev
biopic
bollywood
daughter
amia

More Telugu News