ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ కనిపించడే?: సీఎం చంద్రబాబు సెటైర్లు
- మళ్లీ వస్తానన్న పవన్ ఇక కనపడలేదు!
- జగన్ పై ఉన్నన్ని కేసులు దేశంలో ఎవరిపైనా లేవు
- నేరస్థులకు, దొంగలకు మోదీ కాపలాదారు
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. దేశానికి మోదీ కాపలాదారు కాదని, నేరస్థులకు, దొంగలకు ఆయన కాపలాదారులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 31 కేసులున్న జగన్ ను మోదీ కాపాడుతున్నారని, జగన్ పై ఉన్నన్ని కేసులు దేశంలో ఎవరిపైనా లేవని అన్నారు. వివేకా హత్య ఇంటి దొంగల పనేనని, ఈ హత్యను దాచిపెట్టాలని చూశారని, సిట్ నివేదికను బయటపెట్టొదని, సీబీఐ విచారణ కావాలని కోరుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రజల గెలుపు అని, నేరస్తులు గెలిస్తే ప్రజా ఓటమి అని అన్నారు.