YSRCP: జగన్ ముసుగు రాజకీయాలు తొలగిపోయాయి: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటన్న జగన్ ముసుగు రాజకీయాల తెర తొలగిపోయిందని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న ఆంధ్రులను కేసీఆర్, కేటీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్, జగన్ లు అమరావతిపై దండయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్ కు జగన్ వంతపాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయలను జగన్ పంచుతున్నారని, కేసీఆర్ సెలెక్ట్ చేసినవారినే వైసీపీ అభ్యర్థులుగా ఎంపిక చేశారని ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
jagan
Telugudesam
devineni
TRS
kcr

More Telugu News