Pawan Kalyan: నెల్లూరులో నేడు పవన్ భారీ బహిరంగ సభ.. జనసేనాని షెడ్యూల్ ఇలా..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు జీపీఆర్ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు హెలికాప్టర్‌లో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కోవూరులోని పట్టపుపాలెం, స్టవ్‌బీడీ కాలనీలో ఏర్పాటు చేసిన సభల్లో పవన్ పాల్గొంటారు. రెండు గంటలకు కావలి సమీపంలోని బిట్రగుంట, చెంచులక్ష్మీపురం సభల్లో పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తారు. పవన్ రాక నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా, పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.