India: రాహుల్ గాంధీ సప్నా చౌదరిని పెళ్లి చేసుకోవాలి.. సోనియా కూడా ఇటలీలో డ్యాన్సరే!: బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచిత వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ డ్యాన్సర్, గాయని సప్నా చౌదరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె చేరికను కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాజ్ బబ్బర్ తదితరులు స్వాగతించారు. అయితే సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీజేపీ యూపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ఇటలీలో నృత్యకారిణిగా ఉండేవారని వ్యాఖ్యానించారు. ఆమెను రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ సొంతం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు సప్నా చౌదరిని రాహుల్ కూడా పెళ్లి చేసుకోవాలని సూచించారు. తద్వారా అత్తాకోడళ్లు, ఒకే వారసత్వం, సంస్కృతి, వృత్తికి చెందినవారు అవుతారని ఎద్దేవా చేశారు.

యూపీలోని లక్నోలో సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం. రాహుల్ తల్లి ఇటలీలో ఇదే వృత్తిలో ఉండేవారు. ఆమెను రాజీవ్ తన మనిషిని  చేసుకున్నారు.

ఇప్పుడు రాహుల్ సప్నాను కాంగ్రెస్ లో చేర్చుకుని తన మనిషిని చేసుకున్నారు. రాహుల్ ఆమెను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే అత్తాకోడళ్లు ఒకే సంస్కృతి, వృత్తికి చెందినవారు అవుతారు. భారత ప్రజలు ఓ నర్తకికి దేశాన్ని నడిపే అవకాశం ఎన్నటికీ ఇవ్వరు. అందుకే సమర్థుడు, నిజాయితీపరుడైన మోదీకి ప్రజలు అధికారం అప్పగించారు’ అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
India
Congress
BJP
sapna chowdary
Sonia Gandhi
Rajiv Gandhi
surendra singh

More Telugu News