Rishabpant: కోహ్లీకి కోపం వస్తే... భయంతో వణికిపోతానన్న రిషబ్ పంత్!

షార్ట్స్‌లో చూడండి
భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కోపం వస్తే తాను భయంతో వణికిపోతానని టీమిండియా వికెట్‌ కీపర్, బ్యాట్స్‌ మన్‌ రిషభ్‌ పంత్‌ అంటున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ-20ల్లో రాణిస్తున్న రిషబ్, భవిష్యత్తులో ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న పంత్, ఇటీవల మాట్లాడుతూ, మామూలుగానైతే తాను ఎవరికీ భయపడబోనని, అయితే, విరాట్‌ భయ్యాకు కోపమొస్తే మాత్రం భయపడతానని చెప్పాడు.

తప్పు చేయని వారిపై కోహ్లీ ఎన్నడూ కోపగించుకోడని, ఎవరిపైనైనా కోహ్లీకి కోపం వచ్చిందంటే తప్పు చేసినట్టేనని అన్నాడు. మనపై ఎవరికైనా కోపం వచ్చిందంటే, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలని చెప్పుకొచ్చాడు. రిషబ్ వీడియోను ఢిల్లీ కాపిటల్స్ ఫ్రాంచైజీ, తమ అధికారిక వెబ్‌ సైట్‌ లో ఉంచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధోని శైలీలో స్టంపింగ్ చేయబోయి మిస్ అయిన పంత్ పై కోహ్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rishabpant
Virat Kohli
Delhi Capitals

More Telugu News