కోర్టు అనుమతితో... రఘువీరారెడ్డిపై బెజవాడ పోలీసుల కేసు!

  • టికెట్ అడిగితే దాడి చేయించారు
  • పోలీసులకు సుంకర కృష్ణమూర్తి ఫిర్యాదు
  • 323 సెక్షన్ కింద కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై బెజవాడ గవర్నర్ పేటలో ఓ కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగినందుకు తనపై రఘువీరా దాడి చేయించారంటూ, సుంకర కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేస్తే, వచ్చే న్యాయపరమైన అడ్డంకులపై దృష్టి పెట్టిన పోలీసులు, కేసు పెట్టేందుకు కోర్టు అనుమతి కోరారు. అందుకు విజయవాడ సెషన్స్ న్యాయమూర్తి అంగీకరించడంతో ఐపీసీ 323, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. రఘువీరారెడ్డితో పాటు మరో ముగ్గురిపైనా కేసు పెట్టామని, విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయంలో నిజానిజాలను వెలుగులోకి తేవాల్సివుందని తెలిపారు.
Go Back to Shorts
Raghuveerareddy
Vijayawada
Police
Case

More Telugu News