హైదరాబాద్ బ్రాండ్ చెడగొడుతూ ప్రతీఒక్కరూ ఛీకొట్టే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారు!: సీఎం చంద్రబాబు
- ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు
- ఇలాంటి కుట్రలను చూస్తూ ఊరుకోబోం
- అమరావతిలో టీడీపీ అధినేత టెలీకాన్ఫరెన్స్
కేసుల కోసం జగన్ ఆంధ్రాను కేంద్రానికి అమ్మేస్తారన్న భావన ప్రజల్లో బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ను చెడగొడుతూ ప్రతీఒక్కరూ ఛీకొట్టే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆస్తులపై కేసీఆర్ కన్నేయడం టీడీపీ ఏకపక్ష విజయానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పెత్తనం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. వీరందరికీ ఓటుతో గట్టి గుణపాఠం చెబుతారన్నారు.