manchu vishnu: మంచు విష్ణు 'ఓటర్' నుంచి లిరికల్ వీడియో సాంగ్

షార్ట్స్‌లో చూడండి
మంచు విష్ణు కథానాయకుడిగా సుధీర్ పూదోట నిర్మాణంలో జీఎస్ కార్తీక్ 'ఓటర్' సినిమాను రూపొందించాడు. వినోదం .. సందేశం మేళవించిన ఈ సినిమాలో కథానాయికగా సురభి నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.

"హే టెల్ మీ టెల్ మీ హౌ .. ఒక డౌటే వుంది నౌ .. ఎహె ఎడా పెడా ఇంతందంగా ఎట్టా పుట్టేశావ్. నా కంట్లో కొచ్చేశావ్ .. నా కల్లో టెంటేశావ్ నే చూసి చూడని టైమే చూసి హార్టే కొట్టేశావ్ .." అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. రాహుల్ నంబియార్ గానం ఆకట్టుకునేలా వున్నాయి. తమన్ బీట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస పరాజయాలతో వున్న విష్ణుకి ఈ సినిమా సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి
Go Back to Shorts
manchu vishnu
surabhi

More Telugu News