యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన టెన్త్ విద్యార్థి... పరీక్షలు జరుగుతుండటంతో తలపట్టుకున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన టెన్త్ విద్యార్థి... పరీక్షలు జరుగుతుండటంతో తలపట్టుకున్న పోలీసులు!

  • హైదరాబాద్ ఛత్రినాకలో ఘటన
  • వీడియో తీసి స్నేహితులకు పంపిన విద్యార్థి
  • బాధితురాలికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం
తన ఇంట్లో స్నానం చేస్తున్న యువతిని పదో తరగతి చదువుతున్న విద్యార్థి వీడియో తీసి, స్నేహితులకు ఫార్వార్డ్ చేయగా, ప్రస్తుతం పరీక్షలు జరుగుతూ ఉండటంతో విద్యార్థి భవిష్యత్తును నాశనం చేయాలా? అన్న మీమాంసలో ఉన్న పోలీసులు తలపట్టుకున్నారు. హైదరాబాద్ ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జంగమ్మెట్‌ రవీంద్రనాయక్‌ కాలనీలో యువతి (28) నివాసం ఉంటుండగా, ఎదురింట్లో 16 సంవత్సరాల బాలుడి కుటుంబం నివసిస్తోంది. బాలుడు అప్పుడప్పుడు ఆమె ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమె స్నానం చేస్తుండగా, తన సెల్‌ ఫోన్‌ లో రహస్యంగా వీడియో తీసి, వాటిని స్నేహితులకు పంపి, డిలీట్ చేశాడు. విషయం తెలుసుకున్న మహిళ, ఛత్రినాక పోలీసులను ఆశ్రయించింది. ఆపై మూడు రోజులైనా అరెస్ట్ చేయలేదంటూ, స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయింది. వీడియో దృశ్యాలను డిలిట్‌ చేయడంతో సైబర్‌ క్రైమ్‌ నిపుణులను సంప్రదించామని, ఇంకా రిపోర్ట్ రాలేదని, పైగా బాలుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నాడని చెప్పి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
Hyderabad
Bath
Nude Scene
Video
Police
Student
Exams

More Telugu News