సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కీర్తి సురేశ్ కొత్త చిత్రం ప్రారంభం
- లాయర్ పాత్రలో సాయి ధరం తేజ్
- 'రొమాంటిక్'లో బాలీవుడ్ నటుడు
* ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్న సాయిధరం తేజ్ దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో సాయి లాయర్ పాత్రలో కనిపిస్తాడట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించే అవకాశం వుంది.
* పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిర్మిస్తున్న 'రొమాంటిక్' చిత్రంలో బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే మందిరా బేడీ ఓ పాత్రకు ఎంపిక కాగా, తాజాగా మకరంద్ దేశ్ పాండే కూడా ఈ చిత్రం కేస్టింగ్ లో చేరాడు. నూతన దర్శకుడు అనిల్ పాడూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.