Telangana: అక్కడ మోదీని, ఇక్కడ కేడీని నిలువరించాలి: రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఐను టీ-కాంగ్రెస్ కోరింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తో టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో రేవంత్ మాట్లాడుతూ, సీపీఐ మద్దతుతో కేసీఆర్ అరాచకంపై పోరాడతామని, టీఆర్ఎస్ ని ఓడించేందుకు సీపీఐ సహకారం అవసరమని అన్నారు.

అరాచకానికి కేసీఆర్, మోదీ బొమ్మా బొరుసు లాంటివారని, కేసీఆర్ కేంద్రం నుంచి నయాపైసా రాలేదంటున్నారని, అలాంటప్పుడు నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ ఎందుకు మద్దతిచ్చింది? అని ప్రశ్నించారు. అక్కడ మోదీని, ఇక్కడ కేడీని నిలువరించాలంటూ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయని, టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. మోదీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
Go Back to Shorts
Telangana
TRS
kcr
Revanth Reddy
t-congress

More Telugu News