టీఆర్ఎస్‌లోకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- కేటీఆర్‌తో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భేటీ
- కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రశంస
- రెండు మూడు రోజుల్లో సీఎంతో భేటీ
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను శుక్రవారం ఆయన నివాసంలోనే దేవిరెడ్డి కలుసుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. దాదాపు గంటపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా దేవిరెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దేవిరెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌తో దేవిరెడ్డి సమావేశం కానున్నారు.