ప్రేమ గురించి చెబితే.. పెళ్లి గురించి వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉంటారు: ఆలియా
- నా మైండ్లో పెళ్లి అనేదే లేదు
- నేను వ్యతిరేకించడం లేదు
- నాకు చాలా పని ఉంది
- ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి
‘వ్యక్తిగత జీవితం అంటే మరొకరితో పంచుకోలేనిదని అర్థం చేసుకోవాలి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ ప్రేమ గురించి చెప్పరు. ఒకవేళ చెబితే.. పెళ్లి గురించి వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉంటారు. ప్రస్తుతం నా మైండ్లో పెళ్లి అనేదే లేదు. అలాగని పెళ్లిని వ్యతిరేకించడం లేదు. కానీ ఇప్పుడు నా ప్లాన్లో అది భాగం కాదు. నాకు చాలా పని ఉంది. దీని అర్థం పెళ్లి జరిగిన తర్వాత నేను పనిచేయనని కాదు. ఇప్పుడు మాత్రం నా దృష్టి అంతా పని మీదే ఉంది. సమయాన్ని బట్టి నా ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి’ అని ఆలియా చెప్పారు.