చిరూ .. కొరటాల సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!
- ముగింపు దశలో 'సైరా'
- జూలై నుంచి కొరటాల ప్రాజెక్ట్
- ఒక నాయికగా శ్రుతి హాసన్
'సైరా' షూటింగు జూన్ తో పూర్తవుతుందట. జూలై నుంచి చిరూ .. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. చిరంజీవి ఎప్పుడు తీరికగా వుంటే అప్పుడు ఆయనను కొరటాల కలిసి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లారిటీ ఇస్తూ వస్తున్నాడట. అలాగే ఒకసారి షూటింగు మొదలైతే, ఎక్కడా పెద్ద గ్యాప్ రాకుండా డిసెంబర్ నాటికి షూటింగు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడనీ .. ఒక కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేశారనే వార్తలు షికారు చేస్తున్నాయి.