వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి కొణతాల!
- టీడీపీలో చేరనున్నారని ప్రచారం
- అనుచరులతో మాట్లాడాక మారిన నిర్ణయం
- రేపు జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న కొణతాల
అయితే ఆయనకు రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఇటీవల వైసీపీలో చేరారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. దాడి మొదట టీడీపీలో చేరాలని భావించారట కానీ కొణతాల టీడీపీలో చేరతారని ప్రచారం జరగడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకుని వైసీపీలో జాయిన్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం కొణతాల కూడా వైసీపీలో చేరనుండటంతో విశాఖ జిల్లాలో మరింత ఆసక్తికర పరిస్థితి నెలకొననుంది.