ఎక్కడ చూసినా చైనానే... మోదీ మాత్రం బొక్కబోర్లాపడ్డారు: ఒవైసీ
- చైనా దూకుడుకు బదులేదీ?
- మోదీవి అన్నీ వైఫల్యాలే!
- నిప్పులు చెరిగిన ఎంఐఎం అధినేత
అంతేకాదు, జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరపాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా ఒవైసీ విమర్శించారు. ఎక్కడైనా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు రోజుల పాటు పోలింగ్ జరగడం చూశారా? అంటూ ప్రశ్నించారు. అనంతనాగ్ పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు జిల్లాలు ఉన్నాయని, రెండు జిల్లాలకు తొలి రోజున, మరో జిల్లాకు రెండో రోజు, ఇంకో జిల్లాకు మూడో రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. "వాహ్ మోదీగారూ వాహ్..! కశ్మీర్ ను ఏంచేయాలనుకుంటున్నారు? మీ పాలన కారణంగా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి" అంటూ వెటకారం ప్రదర్శించారు.