Inter: ఏపీ ఇంటర్ ఫస్టియర్ కెమిస్ట్రీ పేపర్ లీక్... పోలీసులకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీకైనట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే బయటకు వచ్చిన పేపర్ ను ఓ జిరాక్స్ సెంటర్ కు తీసుకెళ్లిన కొందరు, దాన్ని జిరాక్స్ తీయిస్తుండగా, చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి, పోలీసులకు ఈ విషయాన్ని ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వశ్చన్ పేపర్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ పేపర్ లీక్ పై విచారణ జరుపుతున్నామని, ఎవరు బయటకు తెచ్చారో తేలుస్తామని అన్నారు. పోలీసులకు ఫోన్ వచ్చిన సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారని, అందువల్ల పరీక్షను అడ్డుకోలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. విచారణ జరిపి, ఈ పేపర్ ను ముందే ఎవరైనా చూశారా? అన్న సంగతి తేల్చిన తరువాత, విద్యా శాఖ అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.
Go Back to Shorts
Inter
Exams
Chemistry
Paper Leak
Question Paper
Guntur District
Sattenapalli
Police

More Telugu News