వీడియో చూస్తూ స్వీయ ప్రసవ ప్రయత్నం... కన్నుమూసిన అవివాహిత!
- యూపీలోని గోరఖ్ పూర్ లో ఘటన
- పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి
- ఎవరికీ చెప్పకుండా గర్భాన్ని దాచిన అవివాహిత
ఈ క్రమంలో ఎవరితోనో పెట్టుకున్న పరిచయం హద్దులు దాటగా, గర్భం దాల్చింది. విషయాన్ని ఎవరికీ చెప్పని ఆమె, తన గదిలోనే వీడియో చూస్తూ, ప్రసవానికి ప్రయత్నించి మరణించింది. ఆ గది నుంచి రక్తం వస్తుండటాన్ని చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూశారు. రక్తం మడుగులో పసికందు, పక్కనే యువతి మృతదేహాలు కనిపించడంతో, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె ఎవరి కారణంగా గర్భం దాల్చిందన్న విషయం ఇంకా తేలలేదని, యువతి కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.